
రంజాన్ విరామం.. 72 గంటలు కాల్పులు బంద్!
డమాస్కస్: పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 72 గంటలపాటు కాల్పులు జరపకూడదని సిరియా ఆర్మీ నిర్ణయించుకుంది. దేశ వ్యాప్తంగా ఈ కాల్పుల విరమణ నిర్ణయం అమలులో ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. జూలై 6 వేకువజామున ఒంటి గంట నుంచి జూలై 8 అర్ధరాత్రి వరకు కాల్పులు నిషేధించారు. ముస్లింలు రంజాన్ పండుగ నేపథ్యంలో ఆయుధాలకు దూరంగా ఉండాలని ఆర్మీ భావించిందని, అందుకే అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
అయితే గత ఫిబ్రవరిలో రష్యా, అమెరికా ఆర్మీ కాల్పుల విరమణ ప్రకటించినా.. అనివార్య కారణాల వల్ల ఆర్మీ కాల్పులు జరిపిన విషయం అందరికీ విదితమే. తిరుగుబాటు దారులపై కాల్పులకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పారా.. లేక ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై కాల్పులకు ఈ నిషేధ ఆజ్ఞలు వర్తిస్తాయా అనే అంశంపై స్పష్టత లేదు.