
న్యూఢిల్లీ : ప్రభుత్వం ఇచ్చే సూచనలను పాటిస్తేనే కరోనా మహమ్మారిని సంపూర్ణంగా అరికట్టవచ్చని ఢిల్లీలోని జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్ననేపథ్యంలో ఇంటి వద్దే భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను చేయాలని పిలుపునిచ్చారు. వీటిని అనుసరించడం ద్వారా ప్రతి ఒక్కరిని రక్షించుకోగలుగుతామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment