చంద్రబాబు కేసీఆర్ను కలుస్తారా?
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకోని రేపు (ఈ 24న) రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యే ఈ విందులో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబులకు ఆహ్వానాలు వెళ్లాయి. వీరితో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. ఇప్పటికే ఇఫ్తార్‌లో పాల్గొనాలని ప్రముఖులకు రాజ్‌భవన్ నుంచి అధికారులు ఆహ్వానాలను పంపారు.
గవర్నర్ ఆహ్వానంపై చంద్రబాబు ఒక్కసారిగా మీమాంసలో పడిపోయారు. ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 'ఓటుకు కోట్లు' కేసు తర్వాత హైదరాబాద్ ను వదిలిపెట్టడమే కాకుండా కేసీఆర్ కు వ్యతిరేకంగా నోరు విప్పని చంద్రబాబు తాజా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలుస్తోంది.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26న ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. 1,95,050 మందికి నూతన వస్త్రాలు పంపిణీ చేయనుంది. అదే రోజు హైదరాబాద్ లోని 1000 ప్రాంతాల్లో లక్ష మందికి ఇఫ్తార్ విందు ఇస్తారు. 100 మసీదుల వద్ద 1000 మందికి చొప్పున నూతన వస్త్రాలు పంపిణీ చేస్తారు. 95 నియోజకవర్గాల్లో ఒక్కో చోట 1000 మందికి చొప్పున విందు, 95 వేల కు టుంబాలకు రూ.500 విలువైన వస్త్రాలు అందజేస్తారు.