పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు | Police Case Filed On Former Minister Ambati Rambabu Over Incident During Vennupotu Dinam Protests In AP | Sakshi
Sakshi News home page

పోలీసు జులుం.. మాజీ మంత్రి అంబటిపై కేసు

Jun 5 2025 9:14 AM | Updated on Jun 5 2025 12:46 PM

Police Case On Ambati Rambabu

వైఎస్సార్‌సీపీ ర్యాలీని అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు

దీనిపై ప్రశ్నించిన అంబటి పట్ల సీఐ ఓవర్‌ యాక్షన్‌

మాజీ మంత్రిని ‘నువ్వు నువ్వు’ అంటూ వేలు చూపిస్తూ దురుసు వ్యాఖ్యలు

లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్‌): మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా అంబటి రాంబాబు సిద్ధార్థ్‌నగర్‌లోని తన నివాసం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్‌కు బయల్దేరగా పోలీసులు అడుగడుగునా అడ్డుకోబోయారు. ర్యాలీ స్థంబాలగరువు, పట్టాభిపురం మీదుగా మూసేసిన జూట్‌ మిల్లు వద్దనున్న సబ్‌ స్టేషన్‌కు చేరుకోగా.. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ, సిబ్బంది అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అంబటి రాంబాబు స్పందించారు.

ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వెళ్తుంటే అడ్డుకోవడం సరికాదని చెప్పారు. అంతమాత్రానికే సీఐ వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబుతో దురుసుగా ప్రవర్తించారు. ర్యాలీగా వెళ్లడానికి వీల్లేదని, ర్యాలీగా నువ్‌ ఎలా వెళ్తావో చూస్తా అంటూ మీదమీదకు వెళ్లి గట్టిగా మాట్లాడడం ప్రారంభించారు. ‘మర్యాదగా మాట్లాడు’ అని అంబటి సూచించగా.. ‘నువ్వు పళ్లు కొరుకుతున్నావ్‌’ అంటూ అంబటికి వేలు చూపించారు. ఏకవచనంతో వాగ్వాదానికి దిగారు. దీంతో సిబ్బంది కలుగజేసుకుని అంబటి, సీఐకి సర్దిచెప్పి పంపించారు. 

అనంతరం రాంబాబు పార్టీ నాయకులతో కలిసి కంకరగుంట ఓవర్‌ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుని వినతిపత్రం అందజేశారు. కాగా, మాజీ మంత్రి అంబటి పట్ల సీఐ వ్యవహరించిన తీరు సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియాలో స్పష్టంగా కనిపించింది. ఎల్లో మీడియాలో మాత్రం కలెక్టరేట్‌లోకి అనుమతించలేదని సీఐతో అంబటి దురుసుగా ప్రవర్తించారంటూ దుష్ప్రచారం చేశారు. 

ఘటన జరిగింది జూట్‌ మిల్లు వద్ద అయితే కలెక్టరేట్‌ ముందు అని బురదజల్లాలని చూశారు. చివరకు పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, అనుమతి లేకుండా ర్యాలీ తీశారంటూ పలు సెక్షన్లతో అంబటిపై కేసు నమోదు చేయడం గమనార్హం. నిబంధనలను అతిక్రమించిన పోలీస్‌ అధికారిని వదిలేసి అంబటిపై కేసు పెట్టడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement