
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టుకు 2014 అంచనాల ప్రకారం రూ.16 వేల కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమని కేంద్రం చెబుతుంటే చంద్రబాబు నోరెత్తకపోవడం పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అనుమానం వ్యక్తంచేశారు. చంద్రబా బూ... ఏమిటీ మీ బలహీనత? కేంద్రాన్ని ఎందుకు అడగరు? కేంద్రం ఇవ్వకపోతే మేమే ఖర్చుపెడతాం అనడమేంటీ? అని ప్రశ్నించారు. ఆయన శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు.
పోలవరానికి కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వదని ఆ పార్టీ నేత పురంధేశ్వరి అడుగుతుండగా అసలు అడగాల్సిన బాబు అడగకపోవడంలో ఆయన బలహీనత లేమిటో అర్థం కావడం లేదన్నారు. పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని విభజన చట్టంలో పెట్టారని, ఆ మేరకు 2014 మే 1న అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ కేబినెట్ తీర్మానం కూడా చేసిందని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment