![‘చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు’ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51469860105_625x300_1.jpg.webp?itok=oFfg_Gm8)
‘చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు’
రాజమండ్రి : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. బాబు ప్యాకేజీతో ఎందుకు సంతృప్తి పడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా గురించి చంద్రబాబు మాట్లాడకపోవడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. చట్టంలో చేసిన అంశాలే అమలు కాలేదని, అలాంటిది మీడియాకు చెప్పినవి అమలు చేస్తారా? అని ఉండవల్లి ప్రశ్నించారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా కుదరదని కేంద్రం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.