మార్గదర్శి విషయంలో అందుకే జీవీరెడ్డి వెనక్కి తగ్గాడు: ఉండవల్లి | Undavalli Arun Kumar Comments On Ramoji Rao | Sakshi
Sakshi News home page

మార్గదర్శి విషయంలో అందుకే జీవీరెడ్డి వెనక్కి తగ్గాడు: ఉండవల్లి

Published Fri, May 19 2023 1:20 PM | Last Updated on Fri, May 19 2023 2:00 PM

Undavalli Arun Kumar Comments On Ramoji Rao - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మార్గదర్శి చిట్‌ఫండ్‌పై చర్చకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీరెడ్డి వెనక్కి తగ్గారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. జీవీరెడ్డి తరువాత  వస్తానన్నారు.. వస్తే  చర్చ ఆరోగ్యకరంగా ఉంటుంది. మార్గదర్శి ఫైనాన్షియర్లపైనే తన పోరాటం’’ అని ఉండవల్లి అన్నారు.

‘‘చిట్స్‌ నిర్వాహకులు ఇతర వ్యాపారాలు చేయకూడదని సుప్రీం స్పష్టం చేసింది. తమకు కంపెనీ యాక్ట్‌ మాత్రమే వర్తిస్తుందని రామోజీ వితండవాదం చేస్తున్నారు. రామోజీ తప్పు చేశారని నిర్ధారణ చేసుకున్నాకే అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీలో ఏ చిట్‌ఫండ్స్‌ కంపెనీ కూడా నిబంధనలు పాటించడం లేదు. చిట్‌ఫండ్‌ సంస్థలు టీడీఎస్‌, జీఎస్టీలు కట్టడంలేదు. రూ.17 వేల కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి వ్యవస్థను శాసిస్తున్నారు. రామోజీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం బ్లాక్‌మనీ అయి ఉండాలి’’ అని అరుణ్‌కుమార్‌ అన్నారు.

ఏపీ , తెలంగాణ రాష్ట్రాల్లో రామోజీరావుకి వచ్చే ఆదాయం రోజుకు పది కోట్లు. ప్రజల డబ్బుతో వ్యాపారం చేసే సంస్థలో నిర్వాహకునికి సంబంధించి 50 శాతం సొంత పెట్టుబడి ఉండాలి అని జడ్జిమెంట్ ఉంది. చట్టాన్ని అందరికీ వర్తింపచేయాలి. రామోజీరావు దీనికి మినహాయింపు కాదు’’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు.
చదవండి: వాలంటీర్ల వ్యవస్థ అంటే చంద్రబాబుకు కడుపుమంట: సీఎం జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement