
ప్రజలెందుకు తెలుసుకోకూడదు?
ఐడీఎస్-2016 కింద ఆదాయ వివరాలు వెల్లడించిన వారి జాబితాను ప్రకటించాలి: ఉండవల్లి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ‘ఆదాయ వెల్లడి పథకం(ఐడీఎస్)-2016’ వివరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తెలిసినప్పుడు.. సాధారణ ప్రజలు ఎందుకు తెలుసుకోకూడదని మాజీ ఎంపీ, పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. ఐడీఎస్-2016 కింద స్వచ్ఛందంగా తమ ఆదాయాలను వెల్లడించిన వారి పేర్ల జాబితాను పారదర్శకతకోసం కేంద్రప్రభుత్వం విడుదల చేయాలని ఆయనడిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఆయన గురువారం లేఖ రాశారు.