
సాక్షి, అమరావతి: రాష్ట్ర వక్ఫ్ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 25న జారీ చేసిన జీవో 16ను సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ, మొగల్రాజపురానికి చెందిన మహ్మద్ ఫరూక్ షుబ్లీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబు శుక్రవారం హైకోర్టును కోరారు.
అత్యవసర విచారణకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ శ్రీభానుమతి ధర్మాసనం తిరస్కరించింది. సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 2016లో జారీచేసిన జీవో 18 ప్రకారం విజయవాడలో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల్సి ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. ఎలాంటి సహేతుక కారణాల్లేకుండా కర్నూలులో వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment