
పార్లమెంట్‌లో పడిపోయిన ఎంపీ.. ఆస్పత్రికి తరలింపు
- సెంట్రల్ హాలులో రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా ఘటన
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల తొలిరోజే ఓ ఎంపీ అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసం చేస్తున్న సమయంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత కేరళ ఎంపీ ఇ.అహ్మద్ పడిపోవడంతో పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఆందోళనకర పరిస్థితి చోటుచేసుకుంది.
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూనే సభకు వచ్చిన అహ్మద్ నీరసంతో పడిపోయారు. పార్లమెంట్ సిబ్బంది అప్రమత్తమై ఎంపీని ఆసుపత్రికి తరలించారు. మళప్పురం లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఇ.అహ్మద్.. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ జాతీయ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. యూపీఏ-2లో విదేశాంగ శాఖ సహాయమంత్రిగానూ అమ్మద్ పనిచేశారు. ఆస్పత్రిలో చేరిన కొద్ది గంటలకే ఎంపీ అహ్మద్ కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 2:30కు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.