సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయని సమాచారం. సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు ఫిబ్రవరి ఒకటిన ఆరి్ధక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు.
ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని సమాచారం. మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు రావచ్చని లెక్కలు వేస్తున్నాయి. ఈ ప్రకటనను ఆరి్ధక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment