Oton account budget
-
‘హామీ’ ఇవ్వలేం!
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకిచ్చి న సూపర్ సిక్స్, ఇతర హామీలను అటకెక్కించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా అసెంబ్లీ సమావేశాలను మంగళవారం ప్రొరోగ్ చేసి బుధవారం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి ంది. ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు నాలుగు నెలల కాలానికి రాష్ట్ర సంచిత నిధి నుంచి రూ.1,29 లక్షల కోట్ల వ్యయానికి అనుమతిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. దీంతో న్యాయ శాఖ కార్యదర్శి సునీత ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రభుత్వం ఇటీవలే అధికారంలోకి వచ్చి నందున, ఆరి్థక శాఖ ఇతర శాఖలతో సమన్వయపరుచుకుంటూ అప్పులు, ఆరి్థక వనరులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేమని అందులో పేర్కొంది. పూర్తి స్థాయి బడ్జెట్‌కు మరి కొంత సమయం కావాల్సి ఉందని, శాసన సభ ఇప్పుడు సమావేశంలో లేనందున ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ద్వారా నాలుగు నెలల వ్యయానికి ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చి ందని ఆర్డినెన్స్‌లో పేర్కొనడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాలు జూలై 26వ తేదీ వరకు నిర్వహించినప్పటికీ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకుండా శ్వేత పత్రాల పేరుతో గత ప్రభుత్వంపై నిందలు వేయడానికే చంద్రబాబు ప్రభుత్వం పరిమితమైంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే వాస్తవ అప్పులను బడ్జెట్ డాక్యుమెంట్లో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడు అప్పులపై చంద్రబాబు అండ్ కో ఎన్నికల ముందు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోతుంది. దీంతో పాటు సూపర్ సిక్స్ హామీలకు పూర్తి స్థాయి బడ్జెట్లో నిధులు కేటాయింపు చేయాల్సి వస్తుంది. ఈ రెండు అంశాల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఏడాదిలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్! కేంద్రం నుంచి వచ్చే ఆదాయ వనరులు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు స్పష్టంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టక పోవడానికి కేవలం హామీలను ఎగరకొట్టేందుకేనని స్పష్టం అవుతోంది. గతంలో ఎప్పుడూ ఒకే ఆరి్థక సంవత్సరంలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో కోవిడ్ లాంటి అసాధారణ పరిస్థితులు లేకున్నా, ఆర్డినెన్స్ జారీ విడ్డూరంగా ఉందని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే 4 నెలల వ్యయానికి సభ ఆమోదం పొందే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి. తొలి వంద రోజుల్లో ప్రాధాన్యతాంశాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వాటిలో ఆర్థికంగా ముడిపడి ఉన్న సూపర్ సిక్స్ హామీలకు చోటు లేదు. తల్లికి వందనం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి అంశాలు 100 రోజుల ప్రాధాన్యతాంశాల్లో లేవు. నాణ్యమైన లిక్కర్, నూతన ఇసుక విధానం, నూతన ఎంఎస్ఎంఈ విధానం, నూతన పారిశ్రామిక విధానం, సీఆర్డీఏలో పెండింగ్ పనులు పూర్తి చేయడం, చెత్త తొలగింపు తదితర ఆరి్థకేతర అంశాలే 100 రోజుల ప్రాధాన్యతల్లో ఉన్నాయి. దీంతో పాటు హామీలను తక్షణమే అమలు చేయడం సాధ్యం కాదని కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించిన విషయం తెలిసిందే. హామీలను ఇప్పట్లో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా స్పష్టమవుతోంది. -
నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు నేడు ఆర్డినెన్స్!
సాక్షి, అమరావతి: నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్ జారీచేయనుంది. మంత్రుల ఆమోదం కోసం మంగళవారం వారికి సర్క్యులేషన్లో పంపగా వారు ఆన్లైన్లో దానికి ఆమోదం తెలిపారు. దీంతో.. దీనిని గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్స్‌ను జారీచేస్తుంది. ఇక ఈ నాలుగు నెలల అత్యవసర వ్యయానికే ఆర్డినెన్స్ జారీచేస్తున్నట్లు సమాచారం.హామీలు ఎగ్గొట్టేందుకే..ఎన్నికల ముందు సూపర్ సిక్స్, సూపర్ టెన్ అంటూ ప్రజలకిచ్చిన హామీల అమలును ఎగ్గొట్టేందుకే ఈ నాలుగు నెలల ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించింది. అంతకుముందు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి నాలుగు నెలల వ్యయానికి సభ అనుమతి తీసుకుంది. ఈ గడువు ఈ నెలాఖరుతో (జూలై 31తో) ముగియనుంది. సాధారణంగా అయితే.. ఎన్నికల ఫలితాలు అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాలు తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈనెల 23న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం ఈనెల 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించినప్పటికీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. పైగా.. శ్వేతపత్రాల పేరుతో ఆత్మస్తుతి పరనిందలతో గత ప్రభుత్వంపై ఆరోపణలకే అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంది. గవర్నర్ ప్రసంగం ద్వారా అప్పులపై అవాస్తవాలను చెప్పించడంతో పాటు హామీలను తక్షణం అమలుచేయలేమని కూడా గవర్నర్‌తో చెప్పించింది. అంటే.. చంద్రబాబు నిజస్వరూపం ఇక్కడే బట్టబయలైంది. హామీలివ్వడమే తప్ప అమలుచేసే తత్వం తనది కాదని ఆయన రుజువు చేసుకున్నారు. అప్పులపై వాస్తవాలు బయటపడతాయనేవాస్తవానికి.. గవర్నర్ ప్రసంగం ఎన్నికల హామీలు అమలు అంశాలతో సాగడం రివాజు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్ ప్రసంగాన్ని గత ప్రభుత్వంపై నిందలకే పరిమితం చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెడితే గత ప్రభుత్వం చేసిన అప్పుల వాస్తవాలను బడ్జెట్ డాక్యుమెంట్లో స్పష్టంచేయాల్సి వస్తుంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. దీంతో శ్వేతపత్రాల ముసుగు లో అవాస్తవ ఆరోపణలతో కాలయాపన చేశారు. అసలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున మరో నాలుగు నెలల వ్యయానికి ఓటాన్ బడ్జెట్‌కు సభ ఆమోదం తీసుకోవచ్చు. అలా చేయకుండా అసెంబ్లీ, మండలి సమావేశాలను ముగించేశారు. అసెంబ్లీ, ‘మండలి’ని మంగళవారం ప్రొరోగ్ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో.. బుధవారం నాలుగు నెలల వ్యయానికి ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌ను జారీచేయనుంది. ఇది అసెంబ్లీని అవమానించడమే..అసెంబ్లీ సమావేశాలను ముగించేసి, ఆర్డినెన్స్ ఇవ్వడం అంటే శాసనసభను అవమానించడమే అవుతుందని సీనియర్ రాజకీయవేత్తలు అంటున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టలేనంత అసాధారణ పరిస్థితులేవీ రాష్ట్రంలో లేవని.. కేంద్ర, రాష్ట్ర ఆదాయాలు ఎంత వస్తాయో స్పష్టంగా ఉన్నాయని, అయినాసరే చంద్రబాబు పూర్తి బడ్జెట్ పెట్టకుండా ఆర్డినెన్స్ ఎత్తుగడ వేశారంటే హామీలకు ఎగనామం పెట్టడానికేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రాధాన్యతల్లో సూపర్ సిక్స్ హామీలకు చోటులేదు. నాణ్యమైన లిక్కర్ బ్రాండ్స్, చెత్త తొలగింపు, నూతన ఇసుక విధానాలకే చోటుండటం గమనార్హం. -
రేపే ఓటాన్ అకౌంట్ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శనివారం (10న) అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 11న విరామం ఇచ్చి.. 12న అసెంబ్లీ ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చించనున్నారు. 13న బడ్జెట్‌ను ఆమోదించి, ఇరు సభలను వాయిదా వేయనున్నారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిల అధ్యక్షతన వేర్వేరుగా సమావేశమైన ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)’సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 11.30కు ప్రారంభమయ్యాయి. శాసనసభ సమావేశ మందిరంలో అసెంబ్లీ, శాసన మండలిల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. తర్వాత సభలను వాయిదా వేశారు. శుక్రవారం శాసనసభ, శాసనమండలి వేర్వేరుగా సమావేశమై.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిపి, ఆమోదిస్తాయి. శనివారం శాసనసభలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ‘2024–25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్’ను ప్రవేశపెడతారు. 11న ఆదివారం విరామం. 12న అసెంబ్లీ, మండలి వేర్వేరుగా సమావేశమై బడ్జెట్ అంశాలపై చర్చిస్తాయి. 13న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదిస్తారు. దీనితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లోనే.. కొందరు మంత్రులు తమ శాఖలకు సంబంధించిన తీర్మానా లు, అంశాలు చర్చకుపెడతారని సీఎం రేవంత్‌రెడ్డి బీఏసీ భేటీలో సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే ఆయా అంశాలను సభ ముందు పెట్టే అంశంపై మరోమారు బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. మరోవైపు గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన శాసనమండలి బీఏసీ కూడా.. శాసనసభ తరహాలోనే ఈ నెల 13 వరకు సమావేశం కావాలని నిర్ణయించింది. ’ బీఏసీలలో ఎవరెవరు? శాసన మండలి, శాసనసభల నిర్వహణ షెడ్యూల్, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయడానికి.. అధికార, ప్రతిపక్షాల సభ్యులతో ‘బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)’లను ఏర్పాటు చేస్తారు. సమావేశాల ప్రారంభం రోజున ఈ బీఏసీలు స్పీకర్/చైర్మన్ అధ్యక్షతన సమావేశమై.. అసెంబ్లీ, మండలి సమావేశాలు కొనసాగే తేదీలు, చర్చించే అంశాలను నిర్ణయిస్తాయి. రాష్ట్ర కొత్త శాసనసభ ఏర్పాటైన నేపథ్యంలో ‘బీఏసీ’ని ఏర్పాటు చేశారు. స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ బీఏసీ భేటీలో అధికార పక్షం నుంచి సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, విప్ బీర్ల అయిలయ్యకు చోటు కల్పించారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి కె.చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరికి చోటు దక్కింది. ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (బీజేపీ), అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ)లకూ అవకాశం కల్పించారు. బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనందున ఆ పార్టీ విజ్ఞప్తి మేరకు మహేశ్వర్‌రెడ్డికి చోటు దక్కింది. మరోవైపు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో.. డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), మహమూద్ అలీ (బీఆర్ఎస్), ఏవీఎన్ రెడ్డి (బీజేపీ), ఎఫెండీ (ఎంఐఎం), అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్
-
parliament session 2024: 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలంటున్నాయి. 31న ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాలు ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయని సమాచారం. సమావేశాల తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. తర్వాతి రోజు ఫిబ్రవరి ఒకటిన ఆరి్ధక మంత్రి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి ఇది చివరి బడ్జెట్. దీంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అవసరమైన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకునేందుకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే ప్రభుత్వం తిరిగి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మహిళా రైతులను ఆకట్టుకునేలా కీలక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని రెట్టింపు చేసే ప్రతిపాదన ఉండొచ్చని సమాచారం. మహిళా రైతులకు కిసాన్ నిధిని పెంచితే ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్లు రావచ్చని లెక్కలు వేస్తున్నాయి. ఈ ప్రకటనను ఆరి్ధక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి. -
637 కోట్లు
ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన నిధులు - అసెంబ్లీ అంచనాల కమిటీకి నివేదిక పంపిన అధికారులు - కొత్త ప్రాజెక్టుల సర్వేలకు నిధులివ్వాలని వినతి - ప్రాజెక్టులనుంచి పూర్తిస్థాయి నీటి విడుదలే లక్ష్యం గద్వాల : జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే 637కోట్ల రూపాయలు అవసరమవుతాయని జిల్లా అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు నివేదికను అసెంబ్లీ అంచనాల కమిటీకి నివేదిక సమర్పించారు. గత ఫిబ్రవరిలో జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అప్పటి ప్రభుత్వం ప్రాజెక్టులకు అరకొర నిధులు కెటాయించింది. అందులోని కేటాయింపు మేరకు నిధులను ఖర్చు చేసే పరిస్థితులు రాలేదు. ఒకేసారి స్థానిక సంస్థలు, ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నికలు రావడంతో ఆశించిన విధంగా పనులు జరగలేదు. నిధులు విడుదల కాలేదు. దీంతో జిల్లాలోని ప్రాజెక్టుల ప్రస్తుత ఖరీఫ్ లక్ష్యం కుదించబడింది. ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు అంచనాలను కొరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు వారిగా నివేదికలు సిద్ధం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగే బడ్జెట్ అంచనాల కమిటీ సమావేశంలోఈ నివేదికల అధారంగా నిధుల కేటాయింపుల అవసరాన్ని ప్రభుత్వం ముందుంచనున్నారు. అయితే, అధికారులు ప్రతిపాదించిన విధంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారా... లేక ప్రతిసారి జరిగినట్టుగానే ఈ సారీ జరగనుందా అనే విషయం బడ్జెట్ సమావేశాల్లో తేలనుంది. రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్లోనైనా ప్రాజెక్టుకు సరిపడా నిధులు కేటాయించి వాటిని విడుదల చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.