వాటిని అటకెక్కించడమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు అడుగులు
అందుకే 4 నెలల్లో రూ.1.29 లక్షల కోట్ల వ్యయానికి అనుమతి
గవర్నర్ ఆమోదంతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకిచ్చి న సూపర్ సిక్స్, ఇతర హామీలను అటకెక్కించడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేసింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా అసెంబ్లీ సమావేశాలను మంగళవారం ప్రొరోగ్ చేసి బుధవారం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చి ంది. ఆగస్టు 1వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు నాలుగు నెలల కాలానికి రాష్ట్ర సంచిత నిధి నుంచి రూ.1,29 లక్షల కోట్ల వ్యయానికి అనుమతిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆర్డినెన్స్ జారీకి ఆమోదం తెలిపారు. దీంతో న్యాయ శాఖ కార్యదర్శి సునీత ఆర్డినెన్స్ జారీ చేశారు.
ప్రభుత్వం ఇటీవలే అధికారంలోకి వచ్చి నందున, ఆరి్థక శాఖ ఇతర శాఖలతో సమన్వయపరుచుకుంటూ అప్పులు, ఆరి్థక వనరులను ఖరారు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేమని అందులో పేర్కొంది. పూర్తి స్థాయి బడ్జెట్‌కు మరి కొంత సమయం కావాల్సి ఉందని, శాసన సభ ఇప్పుడు సమావేశంలో లేనందున ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ద్వారా నాలుగు నెలల వ్యయానికి ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చి ందని ఆర్డినెన్స్‌లో పేర్కొనడం గమనార్హం.
అసెంబ్లీ సమావేశాలు జూలై 26వ తేదీ వరకు నిర్వహించినప్పటికీ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకుండా శ్వేత పత్రాల పేరుతో గత ప్రభుత్వంపై నిందలు వేయడానికే చంద్రబాబు ప్రభుత్వం పరిమితమైంది. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే వాస్తవ అప్పులను బడ్జెట్ డాక్యుమెంట్‌లో స్పష్టం చేయాల్సి ఉంటుంది. అప్పుడు అప్పులపై చంద్రబాబు అండ్ కో ఎన్నికల ముందు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోతుంది. దీంతో పాటు సూపర్ సిక్స్ హామీలకు పూర్తి స్థాయి బడ్జెట్‌లో నిధులు కేటాయింపు చేయాల్సి వస్తుంది. ఈ రెండు అంశాల నుంచి తప్పించుకోవడానికే ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఏడాదిలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్!
కేంద్రం నుంచి వచ్చే ఆదాయ వనరులు, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరులు స్పష్టంగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టక పోవడానికి కేవలం హామీలను ఎగరకొట్టేందుకేనని స్పష్టం అవుతోంది. గతంలో ఎప్పుడూ ఒకే ఆరి్థక సంవత్సరంలో రెండుసార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన దాఖలాల్లేవు. రాష్ట్రంలో కోవిడ్ లాంటి అసాధారణ పరిస్థితులు లేకున్నా, ఆర్డినెన్స్ జారీ విడ్డూరంగా ఉందని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే 4 నెలల వ్యయానికి సభ ఆమోదం పొందే అవకాశం ఉందని అధికార వర్గాలంటున్నాయి.
తొలి వంద రోజుల్లో ప్రాధాన్యతాంశాలను ప్రభుత్వం ఖరారు చేసింది. వాటిలో ఆర్థికంగా ముడిపడి ఉన్న సూపర్ సిక్స్ హామీలకు చోటు లేదు. తల్లికి వందనం, ఆరీ్టసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి అంశాలు 100 రోజుల ప్రాధాన్యతాంశాల్లో లేవు. నాణ్యమైన లిక్కర్, నూతన ఇసుక విధానం, నూతన ఎంఎస్‌ఎంఈ విధానం, నూతన పారిశ్రామిక విధానం, సీఆర్‌డీఏలో పెండింగ్ పనులు పూర్తి చేయడం, చెత్త తొలగింపు తదితర ఆరి్థకేతర అంశాలే 100 రోజుల ప్రాధాన్యతల్లో ఉన్నాయి.
దీంతో పాటు హామీలను తక్షణమే అమలు చేయడం సాధ్యం కాదని కూడా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించిన విషయం తెలిసిందే. హామీలను ఇప్పట్లో అమలు చేయకుండా కాలయాపన చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment