'ట్రంప్ వచ్చాకే దాడులు పెరిగాయి' | racial attacks on a raise after donald trump assumed power, says mallikarjun kharge | Sakshi
Sakshi News home page

'ట్రంప్ వచ్చాకే దాడులు పెరిగాయి'

Published Thu, Mar 9 2017 12:37 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

'ట్రంప్ వచ్చాకే దాడులు పెరిగాయి' - Sakshi

'ట్రంప్ వచ్చాకే దాడులు పెరిగాయి'

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతే అక్కడ మన దేశీయులపై జాత్యహంకార దాడులు పెరిగాయని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడులపై లోక్‌సభ మలివిడత బడ్జెట్ సమావేశాలలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి అంశంపైనా ట్విట్టర్‌లో స్పందిస్తారని, మరి ఈ జాత్యహంకార దాడుల విషయంలో మాత్రం ఆయన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఖర్గే ప్రశ్నించారు.

ప్రధాని వెంటనే ఈ అంశంపై సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అమెరికాలో భారతీయులకు భద్రత కరువైందని, అక్కడ మనవాళ్ల మీద జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. కాగా.. అమెరికాలో జరుగుతున్న జాత్యహంకార దాడుల అంశాన్ని తాము సీరియస్‌గా తీసుకుంటున్నామని, వచ్చేవారం ఈ అంశంపై సభలో ప్రకటన చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభకు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement