పార్లమెంట్
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ, రాజ్యసభలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అధికారిక ప్రకటనను సోమవారం విడుదల చేశాయి. రాష్ట్రపతి ఆదేశాలతో ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. జనవరి 31న ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత బడ్జెట్ సెషన్, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండవ విడత బడ్జెట్ సెషన్ జరగనున్నాయి. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 1 వరకు మధ్యలో విరామం ఉండనుంది. రెండు విడతల మధ్య ఉండే ఈ విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment