సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 15 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనున్నారు.(చదవండి: ఎందుకు భారత వ్యాక్సిన్లపై వివాదం...?)
కాగా, గత సెప్టెంబర్ 14న ప్రారంభమయిన వర్షాకాల సమావేశాలు ప్రకటిత సమయం కన్నా 8 రోజుల ముందే ముగిసిన సంగతి తెలిసిందే.. ఎంపీల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందన్న ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.(చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్త కరోనా)
Comments
Please login to add a commentAdd a comment