వెబ్ డెస్క్ : ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్(ఐసిస్) ఉగ్రవాదులు సోమవారం ఆన్‌లైన్ విడుదల చేసిన ఫొటోలు సంచలనం రేపుతున్నాయి. 2018 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌పై ఉగ్రదాడి చేసి ప్రముఖ ఫుట్‌బాలర్లు రొనాల్డో, మెస్సీ, నెమార్ జేఆర్‌లను హత్య చేస్తామని ఐసిస్ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఊహాజనిత(ఎలా హత్య చేస్తామనే) ఫొటోలను కూడా విడుదల చేసింది ఐసిస్.
ఓ ఫొటోలో బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్‌బాల్ క్రీడాకారుడు నెమార్ జేఆర్‌ను మోకాళ్లపై నిలబెట్టి గొంతుకోసి చంపుతున్నట్లు ఉంది. మరో చిత్రంలో పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొనాల్డోను చంపుతున్నట్లు ఉంది. అర్జెంటీనా ఆటగాడు మెస్సీని ఊచల వెనుక చూపుతూ ఇంకో ఫొటోలో ఉంది.
‘ఇప్పుడు మేం రాస్తున్నాం. మీరు చదువుతున్నారు. త్వరలో ఇదే వార్తను మీరు వింటారు’ అనే హెచ్చరికను విడుదల చేసిన ఫొటోలపై ఐసిస్ ముద్రించింది.
Comments
Please login to add a commentAdd a comment