ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి | ISIS Gunman Attacks Supermarket In France | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి

Published Fri, Mar 23 2018 6:35 PM | Last Updated on Fri, Mar 23 2018 7:51 PM

ISIS Gunman Attacks Supermarket In France - Sakshi

ఉగ్రదాడి జరిగిన సూపర్‌ మార్కెట్‌ పరిసరాలు

ట్రెబెస్‌, ఫ్రాన్స్‌ : ఫ్రాన్స్‌లోని ట్రెబెస్‌లో ఐసిస్‌ ఉగ్రవాది శుక్రవారం నరమేథానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ట్రెబెస్‌లోని ఓ సూపర్‌ మార్కెట్లోకి వెళ్లిన ఉగ్రవాది.. అక్కడి వారిని భయపెట్టేందుకు చేసిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు.

కాల్పులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పోలీసులు హుటాహుటిన మార్కెట్‌ వద్దకు చేరుకున్నారు. పోలీసులపై ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఒక అధికారి గాయపడినట్లు తెలిసింది. సూపర్‌ మార్కెట్లోని కొందరిని ఉగ్రవాది అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, సూపర్‌ మార్కెట్లో కాల్పులు జరిగిన పదిహేను నిమిషాల్లో ట్రెబెస్‌లోని మరో ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు రిపోర్టులు వచ్చాయి. అయితే, ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉందా? అన్నదానిపై స్పష్టత లేదు. మార్కెట్లోకి ప్రవేశించిన ఉగ్రవాదిని ఫ్రాన్స్‌ పోలీసులు మట్టుబెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement