అఫ్గాన్‌లో మరో ఉగ్రదాడి..11 మంది మృతి | 11 killed in attack claimed by ISIS, the latest in spate of violence in Afghanistan | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌లో మరో ఉగ్రదాడి..11 మంది మృతి

Published Tue, Jan 30 2018 2:47 AM | Last Updated on Thu, Mar 28 2019 6:10 PM

11 killed in attack claimed by ISIS, the latest in spate of violence in Afghanistan - Sakshi

సైనిక శిక్షణా కేంద్రం

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఓ సైనిక శిక్షణా కేంద్రానికి కాపలాగా ఉన్నవారిపై దాడి చేసి 11 మంది భద్రతా సిబ్బందిని పొట్టనబెట్టుకున్నారు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటిం చింది. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారు. వారిలో ఇద్దరు ఆత్మాహుతి చేసుకోగా మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఒక ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నామని అఫ్గాన్‌ రక్షణ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement