Happiest Countries 2022: Finland Named Fifth Straight Year, Know India Rank - Sakshi
Sakshi News home page

అత్యంత సంతోషకరమైన దేశం.. వరుసగా ఐదోసారి! ఎందుకో.. ఎలాగో తెలుసా?

Published Fri, Mar 18 2022 9:02 PM | Last Updated on Sat, Mar 19 2022 7:43 AM

Happiest Countries 2022: Finland Fifth Straight Year Secured Top Reasons - Sakshi

ఫిన్లాండ్‌.. మరోసారి హ్యాపీయెస్ట్‌ కంట్రీగా నిలిచింది. వరుసగా ఐదవ ఏడాది ఈ ఘనత సొంతం చేసుకుంది ఈ యూరోపియన్‌ కంట్రీ. ఐక్యరాజ్య సమితి వార్షిక సూచీ వివరాల ప్రకారం.. 


ఈ భూమ్మీద ఫిన్లాండ్‌ అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానంలో ఉంది. వరుసగా ఐదో ఏడాది World's Happiest Nation సూచీలో తొలిస్థానం సంపాదించుకుంది. సెర్బియా, బల్గేరియా, రొమేనియా సైతం ఈ లిస్ట్‌లో పుంజుకుని ముందుకు ఎగబాకాయి. 

► ఇక ఈ సూచీలో ఘోరంగా పతనం అయ్యింది లెబనాన్‌, వెనిజులా, అఫ్గనిస్థాన్‌ దేశాలు. లెబనాన్‌.. ఆర్థిక సంక్షోభం కారణంగా జాబితాలో చివరి నుంచి రెండో ప్లేస్‌లో నిలిచింది. 

► ఇక చివరిస్థానంలో ఉంది అఫ్గనిస్థాన్‌. గత ఆగష్టులో తాలిబన్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నాక మానవ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది.

► వరల్డ్‌ హ్యాపీనెస్‌ రిపోర్ట్‌.. 2022లో వరుసగా పదవ ఏడాది రిలీజ్‌ అయ్యింది. ఆర్థిక, సోషల్‌ డేటా, ప్రజల ఆనందం యొక్క స్వంత అంచనా ఆధారంగా ఈ సూచీలో స్థానం కల్పిస్తారు. సూచీ స్కేల్‌ సున్నా నుంచి పది మధ్యగా ఉంటుంది. సగటున మూడేళ్ల కాలానికి గణిస్తారు. ఇదిలా ఉంటే.. తాజా నివేదిక ఉక్రెయిన్‌-రష్యా యుద్దం కంటే ముందుగానే రూపొందించారు. 

► ఉత్తర యూరప్‌ దేశాల డామినేషన్‌ ఈ సూచీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫిన్లాండ్‌ తర్వాత డెన్మార్క్‌ స్విట్జార్లాండ్‌, ఐస్‌ల్యాండ్‌, నెదర్లాండ్స్‌(హాల్యాండ్‌), నార్వే, స్వీడన్‌ ఉన్నాయి. ప్రత్యేక గౌరవం భూటాన్‌కు దక్కింది.  భారత్‌ 136వ స్థానంలో నిలిచింది‌. 

► ఫిన్లాండ్‌ జనాభా.. దాదాపు 5.5 మిలియన్‌. ఇక్కడి ప్రజల లైఫ్‌స్టయిల్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ఫిన్లాండ్ ప్రజలు సంతోషం వచ్చినా.. దుఖం వచ్చినా గోల చేయరు. ఒక డిగ్నిటీతో సాగిపోతుంటుంది వాళ్ల లైఫ్‌.

► ముఖ్యంగా కరోనా టైంలో ఫిన్లాండ్‌ ప్రపంచానికి ఎ‍న్నో పాఠాలు నేర్పింది. బహిరంగ వేడుకలను పరిమితంగా చేసుకోవాలన్న ప్రభుత్వ పిలుపును తూచా తప్పకుండా పాటించి క్రమశిక్షణలో తమకు తామే సాటని ప్రపంచానికి చాటి చెప్పారు. 


ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌

► విస్తారమైన అడవులు, సరస్సుల దేశం అది. బాగా పనిచేసే ప్రజా సేవలు, అధికారంపై విస్తృత విశ్వాసం ఉంటుంది అక్కడి ప్రజలకు. అలాగే నేరాలు తక్కువ. పైగా అసమానతలకు తావు ఉండదు. ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవిస్తుంటారు అక్కడి ప్రజలు.

► నాణ్యత విద్య, ఉచిత ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం, స్వచ్ఛమైన స్వభావం, అధిక వ్యక్తిగత స్వేచ్ఛ,  బాగా పనిచేసే సమాజం.. Finland ప్రజల సంతోషానికి కారణాలు.

► కరోనా టైంలో ప్రపంచంలో చాలా దేశాలు తీవ్ర సంక్షోభంలో మునిపోయాయి. ప్రజలు మానసికంగా కుంగిపోయారు. అయితే ఫిన్లాండ్‌లో మాత్రం కరోనా ప్రభావం.. వాళ్ల సంతోషాన్ని దూరం చేయలేకపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement