
భారతదేశం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబందనలపై ఐక్యరాజ్యసమితి లేవనెత్తిన భయాలను భారత్ నివృత్తి చేసింది. కొత్తగా తీసుకొచ్చిన "సోషల్ మీడియా నిబందనలను సాధారణ వినియోగదారుల సాధీకరికత కోసం" రూపొందించినట్లు భారత్ పేర్కొంది. వివిధ వాటాదారులతో విస్తృత సంప్రదింపుల తర్వాతానే కొత్త నిబంధనలను ఖరారు చేసినట్లు తెలిపింది. "భారత రాజ్యాంగం ప్రకారం వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ హక్కుకు హామీ ఉంది. స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన మీడియా భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో భాగం" అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది.
భారత దేశం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబందనలు అంతర్జాతీయ మానవ హక్కుల నియమావళిని పాటించలేదని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. పౌర, రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందంలో ఉన్న గోప్యత, అభిప్రాయ స్వేచ్ఛ, వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంతర్జాతీయ చట్టం & ప్రమాణాలను భారత్ పాటించలేదని ఆరోపిస్తూ ఐరాస జూన్ 11న కొత్త ఐటి నిబంధనల గురించి కేంద్రానికి ఒక లేఖ రాసింది. 1979 ఏప్రిల్ 10న భారతదేశం ఈ నిబందనలు ఆమోదించినట్లు పేర్కొంది. సోషల్ మీడియా వేదింపులు, ఉగ్రవాద కార్యకలపాల నివారణ, అశ్లీల కంటెంట్, ఆర్ధిక మోసలను, మత విద్వేషాలను రెచ్చగొట్టే, హింసను ప్రేరేపించే సమాచారాన్ని అరికట్టడానికి, సామాన్యుల సాధికారికత కోసమే కొత్త నిబందనలు తీసుకొచ్చినట్లు కేంద్రం ఐరాసకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment