సాక్షి, అమరావతి: పదో తరగతిలో అత్యుత్తమ ఫలి తాలతో టాపర్స్‌గా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనే ఐక్యరాజ్య సమితికి పంపించామని, ఇది రాష్ట్రానికే గర్వకారణమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఆయన శనివారం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని పత్రికలు, మీడియా ఉద్దేశపూర్వకంగా వీరిపై తప్పుడు కథనాలు ఇస్తున్నాయని, విద్యార్థులను ప్రోత్సహించడం మానేసి నిరుత్సాహపరిస్తే వారితో పాటు తల్లిదండ్రుల మనోభావాలు కూడా దెబ్బతింటాయని హితవు పలికారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని, మన విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. అధునాతన వసతులు, డిజిటల్ విద్యా బోధనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి విద్యార్థులకు ఉచిత ట్యాబ్‌ల పంపిణీ చేస్తామని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరం 8, 9, 10 తరగతుల మేథమెటిక్స్, సైన్స్ పాఠ్యాంశాల మార్పుపై ఆలోచన చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా నియామకాలు చేపడతామని అన్నా రు. టీచర్ పోస్టుల భర్తీపై కూడా త్వరలోనే నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు. సీపీఎస్ విధానంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతున్నందున కేంద్రం కూడా ఒప్పుకోవడంలేదని, అందుకే జీపీఎస్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఉద్యోగులు దీనిపై సహృదయంతో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment