న్యూయార్క్ : వాతావరణ మార్పులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని చెబుతూ అంతర్జాతీయ సమాజంతో కలిసి వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళతామని అన్నారు. లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు సమకూర్చి మహిళలను పొగబారిన పడకుండా కాపాడామని తెలిపారు. మిషన్ జల్‌జీవన్‌తో నీటి కాలుష్యాన్ని నియంత్రిస్తున్నామని వెల్లడించారు. అంతర్జాతీయ సోలార్ కార్యక్రమంలో భారత్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేందుకు అంతర్జాతీయ టెక్నాలజీని వాడుతున్నామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత భారత్‌కు పిలుపు ఇచ్చామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment