ప్రగతి భవన్‌లో కొవ్వొత్తులతో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ సంతోశ్
సాక్షి, హైదరాబాద్: కరోనాపై జరుగుతున్న యుద్ధంలో కీలకంగా ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి పూర్తి రక్షణ కల్పించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. వారిపై దాడులు చేసినా, భయపెట్టినా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు.ప్రతి జిల్లాలోనూ కరోనా పాజిటివ్, అనుమానితులకు చికిత్స అందిస్తోన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలతో ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలోనూ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయాలని డీజీపీ పేర్కొన్నారు.
ఇందులో అడిషనల్ ఎస్పీ, డీఎస్సీలు, జిల్లా వైద్యాధికారి, కమిషనరేట్లలో డీసీపీలు గ్రూపుల్లో ఉండాలని స్పష్టం చేశారు. వైద్యాధికారులు ఇస్తోన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకోవాలని సూచించారు ‘ఈ వాట్సాప్ గ్రూపుల ఏర్పాటుతో గ్రామ స్థాయి నుంచి ప్రజల ఆరోగ్యంపై నిరంతర సమాచారం, కరోనా లక్షణాలు బయటపడ్డా.. వైద్యులతోపాటు, పోలీసులకు సమాచారం తెలియాలని, అప్పుడే సమన్వయం సాధ్యమవుతుందనేది డీజీపీ ఆలోచనగా ఓ ఎస్పీ ర్యాంకు అధికారి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment