
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను నేరరహిత రాష్ట్ర్రంగా మార్చడమే లక్ష్యమని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ను సోమవారం డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజల రక్షణ కోసం.. ఐటీపరంగా దేశంలోనే ప్రథమంగా ప్రారంభించామని తెలిపారు. నేరాల నియంత్రణకు రాష్ట్ర్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని డీజీపీ అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన షి టీమ్, భరోసా లాంటి కార్యక్రమాలు విజయవంతమైనట్లు వెల్లడించారు. రక్షణ పరంగా తెలంగాణ రాష్ట్ర్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫ్ పోలీస్ అండ్ పెట్రోలింగ్ ఉపయోగపడుతుందన్నారు.