
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల ప్రకారం 3,200 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పించేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి హామీ ఇచ్చారని రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు. అలాగే ఈ అంశంపై పోలీస్ శాఖ సిబ్బంది విభాగం అదనపు డీజీపీ శివధర్‌రెడ్డిని సైతం కలిశామని, పదోన్నతులతోపాటు నోషనల్ సీనియారిటీ సమస్యను సైతం పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారని గురువారం గోపిరెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
పెండింగ్‌లో ఉన్న టీఏ మంజూరు చేయించినందుకు డీజీపీకి పోలీస్ సిబ్బంది తరుఫున కృతజ్ఞతలు తెలిపామని, అదే విధంగా పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవుల వ్యవహారాన్ని త్వరగా పరిష్కరించాలని కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment