సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది. మున్ముందు ఎలాంటి క్లిష్ట, అత్యవసర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆ శాఖ సిబ్బందిని ఆదే శించారు. వ్యాధి వేగంగా విస్తరించే ప్రమాదమున్న నేపథ్యంలో సిబ్బంది ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని సూచించారు. దేశవ్యా ప్తంగా తెలంగాణ పోలీసుల పనితీరుపై ప్రశంస లు వస్తున్నాయని చె ప్పారు. శనివారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యాధి వ్యాప్తి ప్రమాదకర దశలో ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.
స్టేషన్ వచ్చేవారికి చేతులు కడుక్కునేందుకు సబ్బు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసే సమయంలో హెల్మెట్ తదితరాలు భద్రత కోసం ధరించాలన్నారు. కరోనా అనుమానిత వ్యక్తులను తరలించే సమయంలో 108, వైద్య, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ అన్ని శాఖలతో ప్రతీ పోలీస్ ఠాణా పరిధిలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, దాని ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవాలని సూచిం చారు. లాక్‌డౌన్ నిబంధ నలు ఉల్లఘించిన వా రిపై కఠినంగా వ్యవ హరించాలని చెప్పా రు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వె ళ్లాక విధిగా స్నానం చేయాలని, కమ్యూనికేషన్ డివైజ్‌లను నిరంతరం శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాం తంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోలీసు సంక్షేమ నిధికి రూ.50 లక్షల విరాళం..
సువెన్ ఫార్మాసూటికల్స్ సీఈఓ వెంకట్ జాస్తి రూ.50 లక్షలు పోలీసు సంక్షేమ నిధికి విరాళమిచ్చారు. శనివారం ఆ చెక్కును డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆయన కార్యాలయంలోనే అందజేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసు శాఖ నిరం తరం విధులను నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో నిత్యావసరాలు, మం దులు, తదితరాల రవాణాలో పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment