APSRTC Invites Bids For Operation Of Electric Air Conditioned Buses - Sakshi
Sakshi News home page

ఎలక్ట్రిక్‌ బస్సుల నిర్వహణపై బిడ్లు ఆహ్వానించిన ఏపీఎస్ ఆర్టీసీ

Published Fri, Jun 4 2021 5:38 PM | Last Updated on Fri, Jun 4 2021 11:28 PM

APSRTC Taking Action To Run Electric Battery Buses - Sakshi

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ​ఆర్టీసీ) ఎలక్ట్రిక్​ బస్సులను ప్రొత్సహించే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం, 350 ఎలక్ట్రిక్​ బస్సులను నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ భావిస్తోంది.  ఈ బస్సుల నిర్వహణకు బిడ్స్‌ ఆహ్వనించామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అయితే, విశాఖకు 100, విజయవాడ, కాకినాడలకు 50 చొప్పున ఎలక్ట్రిక్​ బస్సులను నడపాలని నిర్ణయించారు.  

అమరావతి, తిరుపతి‌‌, తిరుమలకు 50 చొప్పున ఈ బస్సులను కేటాయించారు. వీటిని ఉపయోగించడం వలన 50 శాతం బ్యాటరీ ధరలు తగ్గడంతో పాటు, నిర్వహణ ఖర్చు కూడ తగ్గుతుందని పేర్కొన్నారు. కేంద్రం ఎలక్ట్రిక్​ బస్సుల ప్రోత్సాహకానికి రూ. 55 లక్షలు అందించనుంది.  ఈ బస్సుల నిర్వహణకు ఈ నెల 9వ తేదీ బిడ్స్‌ దాఖలు చేయడానికి చివరితేదీగా నిర్ణయించారు.

చదవండి: వ్యాక్సినేషన్‌ పూర్తి బాధ్యత కేంద్రమే తీసుకోవాలి: సీఎం జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement