
ఊరికి పోదాం.. చలోచలో..
సాక్షి, సిటీబ్యారో: దసరా సెలవుల నేపథ్యంలో నగరం నుంచి సొంత ఊళ్లకు వెళ్లేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ జూబ్లీ బస్‌స్టాండ్ నుంచి వెళ్లిన అన్ని రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. రిజర్వేషన్ లేనివారు సీట్ల కోసం ఫ్లాట్‌ఫారాలపై గంటల తరబడి బారులు తీరారు.