సాక్షి, హైదరాబాద్ : ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం శుభవార్తను అందించింది. దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 3000ల ప్రత్యేక బస్సులు నడుపాలని నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడువనున్నాయి. ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు కాకుండా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు అందుబాటులో ఉండనున్నట్లు టీఎస్ ఆర్టీసీ సోమవారం నాటి ప్రకటనలో తెలిపింది. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్ అమీర్ పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడవునున్నాయి. పండగ రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. (అదనంగా మరో 900 ప్రత్యేక రైళ్లు)
Comments
Please login to add a commentAdd a comment