
సౌత్ కొరియన్ రీమేక్‌లో..?
సల్మాన్‌ఖాన్ కెరీర్‌కు రీమేక్స్ బాగా కలిసొచ్చాయి. ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ కెరీర్‌కు ‘వాంటెడ్’ అనే రీమేక్ కొత్త టర్నింగ్ పాయింట్. అది మన తెలుగు ‘పోకిరి’కి సల్మాన్ చేసిన హిందీ రూపం. ఆ తర్వాత ‘రెడీ’, ‘కిక్’ లాంటి ద క్షిణాది చిత్రాలను రీమేక్ చేసి తన సక్సెస్ గ్రాఫ్‌ను పెంచుకున్నారాయన. తాజాగా ఆయన ఓ కొరియా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
దాదాపు 22 ఏళ్ల క్రితం సల్మాన్‌ఖాన్‌తో ‘అందాజ్ అప్నా అప్నా’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తాజాగా కొరియన్ చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్’ రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఇందులో సల్మాన్‌ఖాన్ హీరో అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయనకు కథ కూడా చెప్పారట. సల్మాన్‌కు కూడా ఈ కథ నచ్చి చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం.