South Korean remake movie
-
అంధురాలి పాత్రలో...
హిట్ రన్ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ సమయంలో తాను సాక్ష్యం చెబుతానని ఓ అమ్మాయి ముందుకొచ్చింది. కానీ, ఆ అమ్మాయికి చూపు లేదు. మరి.. ఈ కేసులో నిజమైన దోషులకు శిక్ష పడిందా? పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరించారు? అనే అంశాల నేపథ్యంలో తెరకెక్కిన సౌత్ కొరియన్ మూవీ ‘బ్లైండ్’ (2011). ఈ సినిమా హిందీలో రీమేక్ కానుంది. చూపులేని యువతి పాత్రలో సోనమ్ కపూర్ నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ‘కహానీ’ (2012), ‘బద్లా’ (2019) చిత్రాల దర్శకుడు సుజోయ్ ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సుజోయ్ వద్ద అసిస్టెంట్‌గా వర్క్ చేసిన షోమీ మఖిజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. -
సౌత్ కొరియన్ రీమేక్‌లో..?
సల్మాన్‌ఖాన్ కెరీర్‌కు రీమేక్స్ బాగా కలిసొచ్చాయి. ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ కెరీర్‌కు ‘వాంటెడ్’ అనే రీమేక్ కొత్త టర్నింగ్ పాయింట్. అది మన తెలుగు ‘పోకిరి’కి సల్మాన్ చేసిన హిందీ రూపం. ఆ తర్వాత ‘రెడీ’, ‘కిక్’ లాంటి ద క్షిణాది చిత్రాలను రీమేక్ చేసి తన సక్సెస్ గ్రాఫ్‌ను పెంచుకున్నారాయన. తాజాగా ఆయన ఓ కొరియా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. దాదాపు 22 ఏళ్ల క్రితం సల్మాన్‌ఖాన్‌తో ‘అందాజ్ అప్నా అప్నా’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషి తాజాగా కొరియన్ చిత్రం ‘ఓడ్ టు మై ఫాదర్’ రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. ఇందులో సల్మాన్‌ఖాన్ హీరో అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయనకు కథ కూడా చెప్పారట. సల్మాన్‌కు కూడా ఈ కథ నచ్చి చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం.