హోదా కావాలని ఆందోళన
తుళ్లూరు రూరల్ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు....హోదా సాధన కై పోరాడదాం అంటూ నూతన అసెంబ్లీ వద్ద సోమవారం నవతరం పార్టీ నాయకులు ఆందోళన చేశారు. అసెంబ్లీ నాలుగో గేటు వద్ద నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధికి హోదా చాలా అవసరం అని నినదించారు. అప్రమత్తమైన పోలీసులు వారి నుంచి జెండాలు, ప్లకార్డులు లాక్కొని అదుపులోకి తీసుకున్నారు.