చేతి వృత్తులు స్వయం ఉపాధికి దోహదం
చేతి వృత్తులు స్వయం ఉపాధికి దోహదం
Published Thu, Jul 21 2016 9:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఏఎన్‌యూ: చేతి వత్తులు స్వయం ఉపాధికి దోహదం చేస్తాయని వీసీ ఆచార్య ఎ.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. యూనివర్సిటీ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగం ఆధ్వర్యంలో జేఎంజే ఉజ్వల హోంలో ఆశ్రయం పొందే బాధిత మహిళలకు ఇచ్చిన శిక్షణ ద్వారా నేర్చుకున్న చేతి వత్తుల ఉత్పత్తుల ప్రదర్శన గురువారం యూనివర్సిటీలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ మహిళలు చేతి వత్తులో నైపుణ్యం పెంపొదించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. స్వయం ఉపాధి పొందటం ద్వారా కుటుంబం, సమాజం అభివద్ధి చెందుతుందని పేర్కొన్నారు. చేతి వత్తుల ద్వారా మహిళలు ఆర్థికంగా పురోభివద్ధి సాధించటంతోపాటు నలుగురికి ఉపాధి కల్పించవచ్చన్నారు. సమాజంలో ఎదురవుతున్న అనేక సవాళ్ళను మహిళలు అధికమించేందుకు స్వయం ఉపాధి సంబంధిత అంశాలు దోహదం చేస్తాయన్నారు. ప్రదర్శనలో ఉన్న వస్తువులను పరిశీలించి వాటిని తయారు చేసిన వారిని, వారికి శిక్షణ ఇచ్చిన వారిని వీసీ అభినందించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సరస్వతిరాజు అయ్యర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ ఉత్పత్తుల ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఉజ్వల హోం నిర్వాహకులు సిస్టర్ రోజ్‌లీనా, రూప తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనివర్సిటీకి చెందిన వివిధ విభాగాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు ప్రదర్శనను వీక్షించి ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
Advertisement