Jhansi Encounter: Will Not Receive His Body, Govt Action Correct, Says Mother of Ghulam - Sakshi
Sakshi News home page

యూపీ ఎన్‌కౌంటర్‌: ‘సరైన శిక్ష పడింది.. నా కుమారుడి శవం కూడా అక్కర్లేదు’

Published Fri, Apr 14 2023 4:11 PM | Last Updated on Fri, Apr 14 2023 4:59 PM

Jhansi Encounter: Will Not Receive His Body, Govt Action Correct, Says Mother Of Ghulam - Sakshi

లక్నో: యూపీలోని ఝాన్సీలో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జరిపిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్, షూటర్ గులామ్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు, గులాం తల్లి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది. కొడుకు ఎన్‌కౌంటర్‌పై మీడియాతో మాట్లాడిన గులామ్ తల్లి ఖుస్నుదా .. ఈ చర్య ఖచ్చితంగా సరైనదని, ఇది గ్యాంగ్‌స్టర్లుకు, నేరస్థులందరికీ గుణపాఠంగా పనిచేస్తుందని చెప్పారు. కాగా అసద్, గులాం ఇద్దరూ ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.

ఫిబ్రవరిలో యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలు పాల్‌ను కాల్చి చంపిన రోజు నుంచి వారిద్దరూ పరారీలో ఉన్నారు. ఈ క్రమంలో వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు గురువారం ఎన్‌కౌంటర్‌లో హతమర్చారు. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌తో కలిసి తన కొడుకు నేరాలు చేస్తున్నాడనే విషయం తనకు తెలియదని ఆమె అన్నారు. "అతను చాలా మంచివాడు, కానీ గత కొన్ని నెలలు నుంచి ఈ ఘోరాలకు పాల్పడి ఉండచ్చని" చెప్పింది. గులామ్ మృతదేహాన్ని తీసుకుంటుందా అని అమెను ప్రశ్నించగా..  కుమారుడి మృతదేహాం తనకు అక్కర్లేదని తెగేసి చెప్పింది.

హతమైన షూటర్ గులాం సోదరుడు రహీల్ హసన్ మాట్లాడుతూ.. "మా వద్ద ఎలాంటి సమాచారం ఉన్నా, పోలీసులకు అందజేశాం. అతని కోసం పోలీసులు నిరంతరం వెతుకుతున్నారని మాకు తెలుసు. నాకు కూడా అరగంట క్రితం ఎన్‌కౌంటర్ గురించి తెలిసింది. అతను ఎప్పటినుంచో కుటుంబంతో సంబంధాలను తెంచుకున్నాడు. అతిక్ కోర్టుకు హాజరైనప్పుడల్లా, గులాం అతనిని కలవడానికి వెళ్ళేవాడని చెప్పాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement