న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై బిహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హత్య కేసులో దోషిగా ఉన్న అతన్ని ఉన్నట్టుండి జైలు నుంచి విడుదల చేయడంపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా తెలంగాణ చెందిన జీ కృష్ణయ్య బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న సమయంలో ఆనంద్ మోహన్ అనుచరులు జరిపిన మూకదాడిలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఆనంద్ యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఇటీవల బిహార్ ప్రభుత్వం జైలు మన్యువల్ నిబంధనల్లో మార్పులు చేసింది. 14 ఏళ్లకు మించి జైల్లో ఉన్న 27 ఖైదీలను విడుదల చేయడానికి ఏప్రిల్ 24న నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ జాబితాలో 15 ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్న ఆనంద్ పేరు కూడా ఉంది. దీంతో ఈ ఏప్రిల్ 27న తెల్లవారుజామునే గ్యాంగ్‌స్టర్ సహస్ర జైలు నుంచి బయటకొచ్చారు. ఆనంద్ మోహన్ విడుదలను ఐఏఎస్ కృష్ణయ్య భార్య ఉమా వ్యతిరేకించారు. తన విడుదలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమె పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వొన్నత న్యాయస్థానం బిహార్ సర్కార్‌కు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
చదవండి: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 యుద్ధవిమానం.. ముగ్గురు మృతి
Comments
Please login to add a commentAdd a comment