లక్నో : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్‌స్టార్ వికాస్ దూబే ఉదంతంలో సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి. అతనికి ఇంతకు ముందు నుంచే అధికార బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యే మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధిచిన ఓ వీడియో జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో సారాంశం పలు అనుమానాలకు తావిస్తోంది. 2017లో ఓ కేసు విచారణ నిమిత్తం కన్పూర్ పోలీసులు దూబేను స్టేషన్‌కు తీసుకువచ్చారు. విచారణలో భాగంగానే పోలీసులు అతన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయగా... అధికార బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అభిజిత్ సంగా, భగ్వతీ సాగర్ పేర్లు చెప్పి ఆ కేసు నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. (తొలి రౌండ్‌లోనే విరుచుకుపడుతూ కాల్చారు)
అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వికాస్ దూబేను అదుపులోకి తీసుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగారు. కాన్పూర్ సమీపంలోని బిక్రూ గ్రామంలో గతవారం జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనలో దూబే పారిపోవడానికి సహకరించిన చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారి వినయ్ తివారీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికాస్‌తో పాటు ఇతర అధికారుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు కరడుగట్టిన నేరగాడైన వికాస్ దూబేపై 60కి పైగా కేసులున్నాయి. ఆయనకున్న రాజకీయ సంబంధాలపూ కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. (పోలీసులతో సంబంధాలు.. ఇంట్లో బంకర్!)
Comments
Please login to add a commentAdd a comment