లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో 8 మంది పోలీసులను హతమార్చిన గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాన్పూర్‌లోని బిక్రూ గ్రామంలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సమాచారం లీక్ చేసిన ఆరోపణలపై సస్పెండ్ అయిన చౌబేపూర్ స్టేషన్ అధికారి వినయ్ తివారీ, బీట్ ఇన్ చార్జి కేకే శర్మలను బుధవారం రోజున అరెస్ట్ చేశారు.
కాగా.. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి పారిపోయి ఇతర పోలీసుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేసి, చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కాన్పూర్ రేంజ్ ఐజీ మోహిత్ అగర్వాల్ తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు మరణించారు. ఈ కేసులో ఇప్పటికే దూబే అనుచరుడు దయా శంకర్ అగ్నిహోత్రిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చదవండి: వికాస్ దూబే సహచరుడు అమర్ ఎన్‌కౌంటర్!
Former Station Officer of Chaubepur, Vinay Tiwari (pic 1) and Beat Incharge KK Sharma (pic 2) have been arrested. They were present during #KanpurEncounter but fled the site of incident during the operation: IG Kanpur Range Mohit Agarwal. #VikasDubey pic.twitter.com/0jPfHwIklB
— ANI UP (@ANINewsUP) July 8, 2020
Comments
Please login to add a commentAdd a comment