చర్మం ఒలిచి..చెప్పులు కుట్టించి..  | Ex Gangster Peeled Off The Skin And Sewed Footwear For His Mother In Madhya Pradesh - Sakshi
Sakshi News home page

చర్మం ఒలిచి..చెప్పులు కుట్టించి.. 

Published Sat, Mar 23 2024 6:22 AM | Last Updated on Sat, Mar 23 2024 1:36 PM

ex gangster peeled off the skin and sewed footwear for his mother - Sakshi

తల్లిపై ప్రేమను వినూత్నంగా చాటిన ఓ మాజీ గ్యాంగ్‌స్టర్‌

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన రౌనక్‌ గుర్జర్‌ అనే మాజీ గ్యాంగ్‌స్టర్‌ తన తల్లిపై ఉన్న ప్రేమను అచ్చంగా రామాయణంలో శ్రీరాముడు పేర్కొన్నట్లుగా చాటాడు. ఏకంగా తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించి కానుకగా ఇచ్చాడు! ఇందుకుగల కారణాన్ని అతను వివరించాడు. గతంలో నేరప్రవృత్తి కారణంగా పోలీసు కాల్పుల బారినపడ్డ గుర్జర్‌ ఆ తర్వాత నిత్యం రామాయణ పారాయణంతో పూర్తిగా మారిపోయినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా శ్రీరాముని పాత్ర నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని.. తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించినా ఆమె రుణం తీర్చుకొనేందుకు చాలదని శ్రీరాముడు స్వయంగా పేర్కొన్న మాట తనను ఎంతగానో ఆకర్షించిందని గుర్తుచేసుకున్నాడు.

అందుకే తాను తల్లికి తన చర్మంతో చెప్పులు కుట్టించాలని నిర్ణయించుకున్నట్లు గుర్జర్‌ చెప్పుకొచ్చాడు. ఇంట్లో వారికి చెప్పకుండా ఆస్పత్రిలో చేరి తన కాలి తొడ చర్మాన్ని సర్జరీ చేయించి తొలగించుకున్నానని.. ఆ చర్మాన్ని చెప్పులు కుట్టే వ్యక్తికి ఇచ్చి చెప్పులు చేయించానన్నాడు.గత వారం ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తన తల్లికి ఈ చెప్పులను బహూకరించగా వాటిని చూసి ఆమె కన్నీటిపర్యంతమైందని గుర్జర్‌ తెలిపాడు. తల్లిదండ్రుల పాదాల చెంతనే స్వర్గం ఉంటుందనే విషయాన్ని సమాజానికి చాటిచెప్పాలనే ఈ పని చేశానన్నాడు. ‘తండ్రి స్వర్గానికి నిచ్చెనయితే తల్లి ఆ మార్గాన్ని చేరుకొనే వ్యక్తి’ అని గుర్జర్‌ పేర్కొన్నాడు. -సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement