ప్రతీకాత్మక చిత్రం
లక్నో: ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ వ్యక్తికి ఊహించని రీతిలో భారీ షాక్ తగిలింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి మహిళ కాదు.. ఓ ట్రాన్స్‌జెండర్ అని తెలిసి కుప్పకూలాడు. పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ ఏడాది ఏప్రిల్ 28న వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భార్య అతడికి దూరంగా ఉండసాగింది. ఎన్ని సార్లు దగ్గరవుదామని ప్రయత్నించినా.. ఏదో ఓ కారణం చెప్పి అతడిని దూరం పెట్టసాగింది.
గట్టిగా అడిగితే.. ఆరోగ్యం బాగాలేదని తెలిపేది. పెళ్లై రెండు నెలలు గడుస్తున్నా.. భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో సదరు వ్యక్తిలో అనుమానం మొదలయ్యింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా షాకింగ్ విషయం తెలిసింది. సదరు వ్యక్తి భార్య అసలు మహిళే కాదని.. ట్రాన్స్‌జెండర్ అని తెలిపారు వైద్యులు. మోసపోయానని తెలుసుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
Comments
Please login to add a commentAdd a comment