కాన్పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో శనివారం పవవ ప్రయాణం చేశారు. కాన్పూర్‌లోని అటల్ ఘాట్ నుంచి మొదలైన ఈ ప్రయాణంలో ప్రధానితోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బిహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీ (సీఎం నితీష్‌కుమార్ స్థానంలో) ఉన్నారు. ప్రతిష్టాత్మక నమామి గంగా కార్యక్రమంలో భాగంగా గంగా ప్రక్షాళనకు జరుగుతున్న పనులను ప్రధాని పర్యవేక్షించారు.