Aakash Chopra makes his predictions for the 1st IND vs NZ Test: కాన్పూర్ వేదికగా గురువారం నుంచి భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. భారత ఓపెనర్ల కంటే పుజారా, రహానే కలిసి ఎక్కువ పరుగులు చేస్తారని అతడు జోస్యం చెప్పాడు.
"పుజారా, రహానే కలిసి భారత ఓపెనర్ల కంటే ఎక్కువ పరుగులు చేస్తారు. పుజారాపై కూడా ఒత్తిడి ఉంది. కానీ లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌తో పూజారా తిరిగి తన ఫామ్‌ను అందుకున్నాడు. ఇద్దరు ఓపెనర్లు కూడా కొత్తవారే. అదే విధంగా న్యూజిలాండ్ బ్యాటర్లలో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ ఇద్దరూ స్పిన్‌కు బాగా ఆడుతారు. ఈ మ్యాచ్‌లో వారిద్దరూ కలిసి 125 కంటే ఎక్కువ పరుగులు చేస్తారని నేను భావిస్తున్నాను" అని ఆకాశ్ చోప్రా యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
ఇక భారత స్పిన్నర్ల గురించి మాట్లాడూతూ.. ఈ మ్యాచ్‌లో భారత్ ఎంత మంది స్నిన్నర్లతో బరిలోకి దిగుతోందో నాకు తెలియదు. కానీ ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు పదికి పైగా వికెట్లు తీస్తారని నేను భావిస్తున్నాను " అని చోప్రా తెలిపాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా విజయం సాధిస్తుందని ఆకాశ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. కాగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే టీమిండియా బరిలోకి లోకి దిగనుంది.
చదవండి: Dinesh Karthik: మళ్లీ తిరిగి జట్టులోకి దినేష్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్
Comments
Please login to add a commentAdd a comment