కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి | Truck Dirver Killed Her Daughter And Another Boy In Kanpur | Sakshi
Sakshi News home page

కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి

Published Mon, May 17 2021 3:05 PM | Last Updated on Mon, May 17 2021 3:10 PM

Truck Dirver Killed Her Daughter And Another Boy In Kanpur - Sakshi

లక్నో: తన కుమార్తెతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి కుమార్తె ఉండడాన్ని చూసిన ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి వారిని హత్య చేసి తలుపు పెట్టి బయటకు వచ్చాడు. తన కుమారుడు అదృశ్యమయ్యాడని బాలుడి తండ్రి ఫిర్యాదు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు బయటకు వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది.

కాన్పూర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ట్రక్‌ డ్రైవర్‌ కుమార్తె ఓ బాలుడిని ప్రేమిస్తుంది. వారి ఇంట్లో వాళ్లు శనివారం వేరే గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడు వెంటనే అమ్మాయి ఇంట్లోకి దూరిపోయి గడియ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ యువతి బంధువు ఇంటికి బయట నుంచి తలుపేశాడు. ఈ విషయాన్ని ఆ యువతి తండ్రికి సమాచారం అందించాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదని ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ క్రమంలో ఆదివారం బాలుడు ఎక్కడ ఉన్నాడో ఒకరు సమాచారం ఇవ్వడంతో తండ్రికి అక్కడకు వెళ్లాడు. తలుపు తీసి చూడగానే బాలిక బాలుడు రక్తపు మడుగులో కనిపించాడు. బాలిక తండ్రి గొడ్డలితో కూతురితో పాటు ఆ బాలుడిని హత్య చేశాడు. ఈ ఘటనతో ఊరి జనమంతా షాక్‌ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తండ్రిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే..
చదవండి: లాక్‌డౌన్‌ ఉల్లంఘన: 2 వేల బైక్‌లు సీజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement