lovers died
-
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రేమికుల మృతి
సాక్షి, నల్లగొండ: రెండేళ్లుగా ప్రేమించుకున్న ప్రేమికులు విడిపోయి ఉండలేక మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. ట్రైనీ ఎస్ఐ శోభన్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొం డ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండలం తెట్టెకుంటకు చెందిన మట్టిపల్లి దుర్గయ్య, సాలమ్మ దంపతులకు నలుగురు సంతానం. అందులో మొదటివాడు మట్టిపల్లి కొండలు (22) హాలియాలోని ఓ వస్త్ర దుకాణంలో పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఉగ్గిరి నాగయ్య, సైదమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ఉగ్గిరి సంధ్య(20) ఇంటర్మీడియెట్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. కొండలు, సంధ్య రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంధ్యకు పీఏ పల్లి మండలం ఘనపురం గ్రామానికి చెందిన మేనత్త కుమారుడితో ఈ నెల 22న నిశ్చితార్థం కాగా. వచ్చేనెల 11న పెళ్లి జరగాల్సి ఉంది. ఉరివేసుకుందామని భావించి.. 22వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సంధ్య.. కొండలు ఇంటికి వచ్చింది. ఇద్దరూ కలిసి నూడుల్స్ తిన్నారు. ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇంట్లో ఉరివేసుకునేందుకు ఫ్యాన్‌కు చీర కట్టారు. ఫ్యాన్ సరిగ్గా లేదని తెలుసుకుని ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగారు. కాసేపటి తర్వాత సంధ్య వాళ్ల ఇంటికి వెళ్లి వాంతులు చేసుకోవడాన్ని వాళ్ల నాన్నమ్మ గమనించి పురుగుల మందు తాగినట్లు తెలుసుకుంది. కొండలు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు ఇద్దరినీ హాలియాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. కొండలును కుటుంబ సభ్యులు నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో కొండలు మృతి చెందాడు. కొద్దిసేపటికే నల్లగొండ ఆస్పత్రిలో సంధ్య కూడా మృతి చెందింది. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొడుకు బాధ నుంచి తేరుకోకముందే.. సంధ్య సోదరుడు వెంకటేశ్వర్లు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ దంపతులకు కూతురూ దూరమై మరింత కడుపుకోతను మిగిల్చింది. ‘ఏడాదిలోనే ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న నాదేమి రాత రా దేవుడా’అంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. చదవండి: డ్రైవర్ నిర్లక్ష్యంతో ఏకంగా కుటుంబమే.. -
పెళ్లైన వ్యక్తితో ప్రేమ.. తల్లిదండ్రులు తిరస్కరించడంతో
యశవంతపుర: వివాహిత వ్యక్తితో యువతి ప్రేమాయణం ఇద్దరినీ బలిగొంది. ఈ దుర్ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకా కోనికెరె గ్రామంలో జరిగింది. చెళ్లకెరె తాలూకా పరశురామపుర గ్రామానికి చెందిన తిప్పేస్వామి (32), హిరియూరు తాలూకా ఉడువళ్లివాసి పుష్పలత (21) ప్రేమికులు. తిప్పేస్వామికి ఇప్పటికే పెళ్లయి పిల్లలున్నారు. మూడేళ్ల నుంచి తిప్పేస్వామి ఆమెకు ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. అతనితో వివాహం చేయాలని పుష్పలతా తల్లిదండ్రుల వద్ద పట్టుబట్టింది. తల్లిదండ్రులు తిరస్కరించడంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. కోనికెరె వద్ద ప్రేయసీ ప్రియుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. హిరియూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కూతురితో బాలుడి ప్రేమ: హత్య చేసి గడియపెట్టిన తండ్రి
లక్నో: తన కుమార్తెతో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి కుమార్తె ఉండడాన్ని చూసిన ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. వెంటనే లోపలికి వెళ్లి వారిని హత్య చేసి తలుపు పెట్టి బయటకు వచ్చాడు. తన కుమారుడు అదృశ్యమయ్యాడని బాలుడి తండ్రి ఫిర్యాదు పోలీసులు దర్యాప్తు చేయగా అసలు బయటకు వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాన్పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ట్రక్ డ్రైవర్ కుమార్తె ఓ బాలుడిని ప్రేమిస్తుంది. వారి ఇంట్లో వాళ్లు శనివారం వేరే గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న బాలుడు వెంటనే అమ్మాయి ఇంట్లోకి దూరిపోయి గడియ పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ యువతి బంధువు ఇంటికి బయట నుంచి తలుపేశాడు. ఈ విషయాన్ని ఆ యువతి తండ్రికి సమాచారం అందించాడు. అయితే తమ కుమారుడు కనిపించడం లేదని ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఆదివారం బాలుడు ఎక్కడ ఉన్నాడో ఒకరు సమాచారం ఇవ్వడంతో తండ్రికి అక్కడకు వెళ్లాడు. తలుపు తీసి చూడగానే బాలిక బాలుడు రక్తపు మడుగులో కనిపించాడు. బాలిక తండ్రి గొడ్డలితో కూతురితో పాటు ఆ బాలుడిని హత్య చేశాడు. ఈ ఘటనతో ఊరి జనమంతా షాక్ తిన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తండ్రిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చదవండి: కాపురాన్ని సరిదిద్దుకుని సంతోషంగా వెళ్తుంటే.. చదవండి: లాక్డౌన్ ఉల్లంఘన: 2 వేల బైక్‌లు సీజ్ -
ప్రాణం తీసిన ప్రేమ పరుగు
నిజాంసాగర్(జుక్కల్): ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందన్న భయంతో పరుగులు తీసిన ప్రేమ ప్రాణం తీసింది. ప్రియురాలితో కలిసి పరుగులు తీసిన ప్రియుడు ద్యానబోయిన బాలకిషన్(19) అలియాస్ చింటు అనే యువకు డు కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. కరెంట్ షాక్ గురైన ప్రియుడి ప్రాణాలను కాపాడేందుకు ప్రియురాలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అడవి పందుల బెడద నివారణ కోసం వరి పంట పొలం చుట్టూ ఏర్పాటు చేసిన కరెంట్ కంచె ప్రియుడి ప్రాణం తీసిన సంఘటన నిజాంసాగర్ మండలం ఒడ్డేపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ద్యానబోయిన(బుడాల) లక్ష్మయ్య, రాజవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు నారాయణ, బాలకిషన్ ఉన్నారు. చిన్నకుమారుడు బాలకిషన్(చింటు) బాన్సువాడ లో ఐటీఐ ఫస్టియర్ చదువుతున్నాడు. ఓ యువతి తో బాలకిషన్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దేవీ శరన్నవరాత్రుల్లో ఒడ్డేపల్లిలో ఏర్పాటు చేసిన దుర్గాదేవికి శుక్రవారం రాత్రి నిమజ్జన శోభాయాత్ర నిర్వహించారు. బాలకిషన్ తన ప్రియరాలితో గ్రామ పొలిమెరల్లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని ఇద్దరు యువకులు బాలకిషన్‌కు ఫోన్ చేశారు. ప్రియురాలితో కలిసి వెళ్లినట్లుగా పెద్దలకు విషయం తెలిసిందని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సదరు యువకులు బాలకిషన్‌కు తెలిపారు. దాంతో ప్రియురాలితో కలిసి బాలకిషన్ పంట పొలా ల వైపు పరుగులు తీశారు. గ్రామ శివారులోని వరి పంట పొలానికి అమర్చిన కరెంట్ తీగను గమనించకుండా ముందుకు వెళ్లారు. కరెంట్ షాక్‌కు గురైన బాలకిషన్ దూరంగా వెళ్లూ అంటూ ప్రియురాలిని అప్రమత్తం చేశాడు. దాంతో ప్రియురాలు ప్రియుడిని కాపాడేందుకు గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. స్థానికులు అక్కడికి చేరుకునేలోగా బాలకిషన్ అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బాలకిషన్ తల్లిదండ్రులు, కటుంబీకులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిజాంసాగర్ ఏఎస్ఐ కొణారెడ్డి హుటాహుటిన ఒడ్డేపల్లికి చేరుకున్నారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఎస్ఐ నాగరాజు వర్మ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంని నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యమపాశంగా కరెంట్ కంచె.. అడవి పందుల కోసం వరిపంట పొలం చుట్టూ అమర్చిన కరెంట్ కంచె బాలకిషన్ ప్రాణం తీసిం దని ఎస్ఐ నాగరాజు వర్మ తెలిపారు. ప్రియురాలితో కలిసి గ్రామ శివారులోకి వెళ్లిన విషయం పెద్దలకు తెలిసిందని యువకులు చెప్పడంతో భయంతో పరుగులు తీశారన్నారు. కరెంట్ కంచె ను గుర్తించకుండా వెళ్లడంతో బాలకిషన్ కరెంట్ షాక్ గురై మృతి చెందాడన్నారు. ఈ కేసులో పంటపొలానికి కరెంట్‌ను ఏర్పాటు చేసిన అంజయ్య, బొందుసాబ్తో పాటు ఫోన్ చేసిన యువకులు జ్ఞానేశ్వర్, నరేశ్‌పై, ప్రియురాలిపై కేసు నమోదు చేశామన్నారు. -
ప్రేమికుల బలవన్మరణం
బళ్లారి (తోరణగల్లు) : తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని పురుగుల మందు తాగి ప్రేమికులు బలవన్మరణం పొందిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది. పీడీహళ్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని దేవీనగర్‌కు చెందిన ప్రవీణ్(21)డిప్లమో పూర్తి చేసి సీసీ కెమేరాలు అమర్చే షాపులో పని చేస్తున్నాడు. వీవీ సంఘం కళాశాలలో డిప్లమో ఫ్యాషన్ డిజైనింగ్ బ్రాంచ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన ప్రియాంక(18)ను ప్రేమించాడు. గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే వీరిద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని చేళ్లగుర్కి వద్ద గల రూపనగుడి రోడ్డులోకి చేరుకుని సోమవారం సాయంత్రం పురుగుల మందు తాగారు. పురుగుల మందు ప్రభావంతో ప్రవీణ్ వెంటనే మృతిచెందాడు. ప్రియాంక అస్వస్థతకు గురైంది. స్థానికులు గమనించి విమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ ప్రియాంక కూడా సోమవారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటనపై పీడీ హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రియుడుతో గొడవ... ప్రియురాలి బలవన్మరణం బెంగళూరు(బనశంకరి) : ప్రియుడితో గొడవపడిన ఇంజనీరింగ్ విద్యార్థిని నాలుగు అంతస్తు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహదేవపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు ... బి.నారాయణపుర కు చెందిన నేహా (22) ఇక్కడి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతోంది. ఇటీవల ఈమె తల్లి మృతి చెందడంతో ఇంటిలో ఉంటోంది. నేహా స్నేహితుడు విఘ్నేష్‌ను ప్రేమిస్తోంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నట్లు తెలుస్తోంది. దీంతో నేహా సోమవారం రాత్రి విఘ్నేష్ నివాసముంటున్న డీఆర్డీఓ క్వార్టర్‌కు వెళ్లి అతనితో గొడవపడి పక్కనే ఉన్న నాలుగు అంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మహదేవపుర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.