వరకట్నంగా లక్షలు మింగినా తీరని దాహం
అదనపు కట్నం కోసం తీవ్ర వేధింపులు
ఆధునిక సమాజంలో కూడా వరకట్న హత్యలు మహిళల జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. లక్షలకు లక్షలు కట్నం పోసి పెళ్ళిళ్లు చేసినా ఆడబిడ్డల తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు. తాజాగా ఖరీదైన కారు, అదనపు కట్నం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన కలకలం రేపింది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్నగ్రేటర్ నోయిడాలో ఈ విషాదం చోటు చేసుకుంది
టయోటా ఫార్చ్యూనర్ కారు, మరో రూ.21 లక్షల కోసం కోడలు కరిష్మాను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రూపింది. బాధితురాలు కరిష్మా సోదరుడు దీపక్ సమాచారం ప్రకారం 2022, డిసెంబరులో కరిష్మా, వికాస్‌కు వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి రూ. 11 లక్షల విలువైన బంగారంతో పాటు ఒక SUVని ఇచ్చింది. అయినా వికాస్ కుటుంబం కొన్నేళ్లుగా మరింత కట్నం డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీనికితోడు ఆడపిల్ల పుట్టిందనే సాకుతో వారి వేధింపులు మితి మీరి పోయాయి. దీంతో గ్రామ పెద్దల మధ్య రెండు కుటుంబాలు విభేదాలూ పరిష్కారానికి ప్రయత్నించాయి. దీంతో కరిష్మా కుటుంబం రూ. 10 లక్షలు చెల్లించిన వారి వేధింపులు ఆగలేదు, చివరికి ఆమెను పొట్టన బెట్టుకున్నారని దీపక్ ఆరోపించాడు.
ఈ మేరకు కరిష్మా సోదరుడు దీపక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తన భర్త వికాస్, అతని తల్లిదండ్రులు , తోబుట్టువులు తనను కొట్టారని వాపోయిందని తెలిపారు. ఏమైందో తెలుసుకుందామని ఆమె ఇంటికి చేరుకునే సరికే ఆమె శవమై కనిపించిందని ఆరోపించాడు. దీపక్ ఫిర్యాదు మేరకు వికాస్, అతని తండ్రి సోంపాల్ భాటి, అతని తల్లి రాకేష్, సోదరి రింకీ, సోదరులు సునీల్, అనిల్‌లపై వరకట్న హత్య కేసు నమోదైంది. వికాస్, తండ్రి అరెస్ట్ కాగా మిగిలినవారు పరారీలోఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment