Fortuner car
-
విషాదం: ఫార్చ్యూనర్ కోసం ‘కరిష్మా’కు భవిష్యత్తే లేకుండా చేశారు
ఆధునిక సమాజంలో కూడా వరకట్న హత్యలు మహిళల జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. లక్షలకు లక్షలు కట్నం పోసి పెళ్ళిళ్లు చేసినా ఆడబిడ్డల తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు. తాజాగా ఖరీదైన కారు, అదనపు కట్నం కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన కలకలం రేపింది. దేశ రాజధాని నగరం న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్నగ్రేటర్ నోయిడాలో ఈ విషాదం చోటు చేసుకుంది టయోటా ఫార్చ్యూనర్ కారు, మరో రూ.21 లక్షల కోసం కోడలు కరిష్మాను దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం రూపింది. బాధితురాలు కరిష్మా సోదరుడు దీపక్ సమాచారం ప్రకారం 2022, డిసెంబరులో కరిష్మా, వికాస్‌కు వివాహమైంది. పెళ్లి సమయంలో వరుడి కుటుంబానికి రూ. 11 లక్షల విలువైన బంగారంతో పాటు ఒక SUVని ఇచ్చింది. అయినా వికాస్ కుటుంబం కొన్నేళ్లుగా మరింత కట్నం డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆమెను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసింది. దీనికితోడు ఆడపిల్ల పుట్టిందనే సాకుతో వారి వేధింపులు మితి మీరి పోయాయి. దీంతో గ్రామ పెద్దల మధ్య రెండు కుటుంబాలు విభేదాలూ పరిష్కారానికి ప్రయత్నించాయి. దీంతో కరిష్మా కుటుంబం రూ. 10 లక్షలు చెల్లించిన వారి వేధింపులు ఆగలేదు, చివరికి ఆమెను పొట్టన బెట్టుకున్నారని దీపక్ ఆరోపించాడు. ఈ మేరకు కరిష్మా సోదరుడు దీపక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తన భర్త వికాస్, అతని తల్లిదండ్రులు , తోబుట్టువులు తనను కొట్టారని వాపోయిందని తెలిపారు. ఏమైందో తెలుసుకుందామని ఆమె ఇంటికి చేరుకునే సరికే ఆమె శవమై కనిపించిందని ఆరోపించాడు. దీపక్ ఫిర్యాదు మేరకు వికాస్, అతని తండ్రి సోంపాల్ భాటి, అతని తల్లి రాకేష్, సోదరి రింకీ, సోదరులు సునీల్, అనిల్‌లపై వరకట్న హత్య కేసు నమోదైంది. వికాస్, తండ్రి అరెస్ట్ కాగా మిగిలినవారు పరారీలోఉన్నారు. -
ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..
లక్నో: తాను అడిగిన ఫార్చునర్ కారును కట్నంగా ఇవ్వలేదని పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్. ఈ వివాహం తనకు వద్దని పెళ్లికుతూరుకు మెసేజ్ చేసి చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు పేరు సిద్ధార్థ్ విహార్. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్ ద్వారా తెలియజేశాడు వరుడు. మరో ఘటనలో పెళ్లికొడుకు నచ్చలేదని.. అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాలో కూడా ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లిమండపంలో దండలు మార్చుకున్న తర్వాత ఓ పెళ్లికూతురు అనూహ్యంగా పెళ్లి రద్దు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లి చూపుల్లో తాను చూసిన అబ్బాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి వేరని వధువు చెప్పింది. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని పేర్కొంది. ఇక చేసేదేమీ లేక పెళ్లికొడుకు కుటుంబం కూడా పెళ్లిని రద్దు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే తాము పెళ్లికూతురుకు పెట్టిన నగలు తిరిగి ఇవ్వలేదని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు. చదవండి: స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు -
మరదలి పెళ్లి కోసం.. ఫార్చూనర్ కారు చోరీ
తన మరదలికి పెళ్లి చేయాలనుకున్నాడు. అందుకోసం డబ్బులు కావాలి. ఏంచేయాలో తెలియలేదు. దాంతో, తాను డ్రైవర్ గా పనిచేస్తున్న ఖరీదైన ఫార్చూనర్ కారునే ఎత్తుకెళ్లిపోయాడు. మహేష్ జివాచ్ అనే వ్యక్తి ఫైవ్ స్టార్ హోటల్లో జిమ్ కోచ్ అయిన సం దీప్ గోమ్స్ (35) వద్ద డ్రైవర్ గా పనిచేస్తాడు. తన మరదలి పెళ్లికి డబ్బులు సర్దడానికి వేరే దారిలేక తాను డ్రైవింగ్ చేసే రూ. 30 లక్షల విలువైన ఫార్చూనర్ కారును ఈనెల 11న ఎత్తుకెళ్లిపోయాడు. దాన్ని ఎలాగైనా అమ్ముకోవాలని రకరకాలుగా ప్రయత్నించాడు. అలహాబాద్ లో ఒకసారి, బిహార్ లో మరోసారి ప్రయత్నించాడు. ఎక్కడా కుదరలేదు. దాంతో దాన్ని టాక్సీలా మార్చి జనాల్ని తిప్పడం మొదలుపెట్టాడు. గోమ్స్ వద్ద మహేష్ గత ఆరు నెలలుగా పనిచేస్తున్నాడు. 11వ తేదీ రాత్రి 8.30 గంటల సమయంలో అతడు తన బాస్ కు చెప్పకుండా కారు తీసుకుని వెళ్లిపోయాడు. ఆరోజు రాత్రి, మర్నాడు అంతా అతడికోసం ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. అతడు కూడా తనకు ఫోన్ చేయకపోవడంతో, అనుమానం వచ్చి ఫిర్యాదుచేశానని చెప్పారు. సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా తన ఆచూకీ గమనిస్తారని, పాత సిమ్ కార్డు తీసేసి, కొత్త సిమ్ వేసుకున్నాడు. అయితే అతగాడి ఫోన్ ఐఎంఈఐ నెంబరు ద్వారా పోలీసులు ఆచూకీని పట్టేశారు. చివరకు ప్రయాణికులను తరలిస్తుండగా పట్టుకున్నారు. అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. -
కారు ఇలా.. మనుషులెలా?
ఢిల్లీలోని అలీపూర్ సమీపంలో జీటీ కర్నాల్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. అత్యంత వేగంగా వెళ్తున్న ఫార్చూనర్ కారు ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఫార్చూనర్ కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు ముందుభాగంతో పాటు వెనక సీట్ల వద్ద కూడా పరిస్థితి భయానకంగా మారింది. సాధారణంగా ఫార్చూనర్ లాంటి పెద్ద కార్లు ఒక మాదిరి ప్రమాదాలను సులభంగానే తట్టుకుంటాయి. కానీ ఈ కారు పరిస్థితి చూస్తుంటే మాత్రం అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొందని చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని అదనపు డీసీపీ పంకజ్ కుమార్ తెలిపారు. -
ఫార్చునర్ బోల్తా: ఇద్దరి మృతి
* టైర్ పగలడంతో అదుపుతప్పిన కారు * అతివేగంతోనే ప్రమాదం! * దర్గాకు వెళ్లి వస్తుండగా ఘటన * మృతులు నగరవాసులు * క్షతగాత్రులను పరామర్శించిన చార్మినార్ ఎమ్మెల్యే పూడూరు: వేగంగా వెళ్తున్న ఫార్చునర్ కారు టైర్ పగలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హైదరాబాద్ పాతబస్తీవాసులు. దర్గాకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది కర్ణాటక రాష్ట్రం చించోలిలో ఉన్న దర్గాలో జల్సా ఉత్సవాలకు ఫార్చునర్ కారు(ఏపీ 09 బీజడ్ 0440)లో వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున పూడూరు మండలం కేశవరెడ్డి పాఠశాల సమీపంలో రహదారిలో మలుపులో కారు ముందు టైర్ పగిలిపోయింది. వాహనం వేగంగా ఉండడంతో రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సయ్యద్ అలీమొహియుద్దీన్(32), సయ్యద్ ఫహీమొద్దీన్(30) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కారులో ప్రయాణిస్తున్న వలీ పాషా(32) పరిస్థితి విషమంగా ఉంది. నహీముల్లా, పిరాసత్ ఉల్లా, హజీజ్, అజారుద్ధీన్, బురాన్పాషా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు. వికారాబాద్ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, మృతులు, క్షతగాత్రులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. మృతుల బంధువు హైమద్ ఉల్ఉస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. మలుపులో మాటేసిన మృత్యువు ఫార్చునర్ కారు అతివేగంగా ఉండడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనం వేగంగా ఉండడంతో డ్రైవర్ రహదారిపై ఉన్న మలుపును గమనించలేదు. మలుపు వద్దకు రాగానే గుర్తించి ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో ఫార్చునర్ కారు ముందు టైరు పగిలిపోయింది. దీంతో వాహనం పల్టీలు కొడుతూ దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న రోడ్డుపక్కన ఉన్న గుంతలో పడిపోయింది. వాహనం వేగంగా ఉండడం, పల్టీలు కొట్టడంతో ఫార్చునర్ వాహనం నుజ్జనుజ్జయింది. సంఘటన బాధాకారం... దర్గాకు వెళ్లి వస్తున్న వారు ప్రమాదానికి గురికావడంతో బాధాకరమని చార్మినార్ ఎమ్మెల్యే సయ్యద్ పాషా ఖాద్రీ పేర్కొన్నారు. క్షతగాత్రులు, మృతులు చార్మినార్ ప్రాంతవాసులు కావడంతో విషయం తెలుసుకున్న ఆయన వికారాబాద్ వచ్చారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.