ఢిల్లీలోని అలీపూర్ సమీపంలో జీటీ కర్నాల్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. అత్యంత వేగంగా వెళ్తున్న ఫార్చూనర్ కారు ఆగి ఉన్న మరో వాహనాన్ని ఢీకొందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఫార్చూనర్ కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారు ముందుభాగంతో పాటు వెనక సీట్ల వద్ద కూడా పరిస్థితి భయానకంగా మారింది.
సాధారణంగా ఫార్చూనర్ లాంటి పెద్ద కార్లు ఒక మాదిరి ప్రమాదాలను సులభంగానే తట్టుకుంటాయి. కానీ ఈ కారు పరిస్థితి చూస్తుంటే మాత్రం అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొందని చెబుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని అదనపు డీసీపీ పంకజ్ కుమార్ తెలిపారు.