సాక్షి, పెద్దపల్లి: అత్తింటి వేధింపులకు ఓ అబల బలైంది. అదనపు కట్నం తేవాలన్న వేధింపులతో మనస్తాపానికి గురైన మూడు నెలల గర్భిణి తన 18 నెలల కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. జూలపల్లి మండల కేంద్రానికి చెందిన చిగుర్ల మౌనిక (26)కు ధర్మారం మండలం బంజరుపలిŠల్ గ్రామానికి చెందిన సివిల్ సప్లయిస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేశ్‌తో రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది.
ప్రస్తుతం దంపతులిద్దరూ పెద్దపల్లి పట్టణంలోని భూంనగర్‌లో నివాసం ఉంటున్నారు. వివాహ సమయంలో రమేశ్‌కు రూ.27లక్షలు ముట్టజెప్పారు. అయితే పెళ్లి తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని మౌనికను వేధింపులకు గురిచేస్తున్నాడు. బుధవారం ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపానికి గురైన మౌనిక, తన 18 నెలల చిన్నారితో కలిసి పెద్దపల్లి శివారులోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
ప్రస్తుతం మౌనిక మూడు నెలల గర్భవతి. ముక్కుపచ్చలారని 18 నెలల చిన్నారి, కడుపులో ఉన్న మూడు నెలల కళ్లు తెరవని పసికందుతో సహా మూడు ప్రాణాలు బలవడంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్‌కుమార్, ఎస్‌ఐ రాజేశ్‌లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బావి నుంచి బయటకు తీయించారు. మౌనిక చావుకు కారణమైన భర్త రమేశ్‌ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి సోదరుడు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment