బనశంకరి : వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలో ఆలస్యంగా నందినీ లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. నందినీలేఔట్ కృషానందనగరలోని బీబీఎంపీ ఆసుపత్రిలో పనిచేస్తున్న అశ్వినీ (32)కి మూడేళ్ల క్రితం డాక్టర్ లోహిత్‌తో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త వేధించడంతో అశ్విని తన తల్లి ఇంటిలో నివాసం ఉంటోంది. సోమవారం ఆస్పత్రిలో విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న అశ్వినీ తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం అశ్వని గది నుంచ ?బయటికి రాకపోగా అనుమానించిన తల్లి గదిలోకి వెళ్లి చూడగా ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. భర్త వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందుని అశ్వినీ తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.