
తిరువొత్తియూరు(తమిళనాడు): యువతి ఆత్మహత్య ఘటనలో ప్రేమికుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కోవై జిల్లా అన్ననూర్ సమీపంలోని కెంపనాయకన్ పాళయంలో బీహార్‌కు చెందిన దంపతులు బిక్కుకుమార్, బీరెత్తి కుమారి రెండేళ్ల నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న తేని జిల్లాకు చెందిన పాండి మురుగన్ అనే యువకుడితో బీరెత్తికుమారికి వివాహేతర సంబంధం ఏర్పడింది.
వీరిద్దరూ ఉల్లాసంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోను ఆమె భర్తకు పంపి బ్లాక్‌మెయిల్ చేశాడు. దీనిపై బీరెత్తికుమారి, బిక్కుకుమార్ ఈ నెల 17వ తేదీ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కోవై గణేషన్‌పురంలో కాపురం పెట్టారు.
చదవండి: లక్ష రూపాయల కోసమే రాజేశ్వరి వివాహేతర సంబంధం..
ఈ క్రమంలో పాండి మురుగన్ మరోసారి వీడియో పంపాడు. తీవ్ర మనస్తాపానికి గురైన బీరెత్తికుమారి ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న అన్ననూర్ పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment